హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రాఖీకి దూరంగా.. హక్కుల కోసం విద్యార్థుల పోరాటం

WGL: రక్షాబంధన్ సందర్భంగా కుటుంబ సభ్యులు పండుగ జరుపుకుంటుండగా శుక్రవారం వరంగల్ నగరంలోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థులు, హౌస్ సర్జన్లు తమ డిమాండ్ల సాధన కోసం నిరసన కొనసాగించారు. స్టైఫండ్ పెంపు జీవోను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో విడుదల చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.