హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు అందుబాటులో యూరియా నిల్వలు

MDK: వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామంలోని హాకా సర్వీస్ సెంటర్‌లో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని సహకార సంఘం సిబ్బంది తెలిపారు. 560 యూరియా బస్తాల నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కొనుగోలుదారులు 'యూరియా యాప్' ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవాలని కోరారు. ఎరువుల కొరత తలెత్తకుండా డిమాండ్‌కు అనుగుణంగా నిల్వలను తెప్పిస్తామని రైతులకు స్పష్టం చేశారు.