హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు

MDK: ​వెల్దుర్తి మండలం కుక్కునూరు గ్రామ సమీప వాగు వద్ద కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని పోతిరెడ్డిపల్లి తండాకు చెందిన మౌల్చంద్ నాయక్‌గా గుర్తించారు. 108 సిబ్బంది స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.