హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తలకు నిరంతరం అండగా సీఎం

NTR: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. పార్టీ పట్ల అచంచలమైన నిబద్ధత కలిగిన నేతగా.. విధేయతతో పనిచేస్తూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, కార్యకర్తలకు నిరంతరం అండగా నిలవడంలో దేవినేని ఉమ చేస్తున్న కృషి అభినందనీయమని సీఎం ప్రశంసించారు.