హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మారికవలస గురుకులం కొనసాగించాలి'

ASR: మారికవలసలో గిరిజన గురుకుల పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని కాంగ్రెస్‌ పీసీసీ డెలిగేట్‌ సభ్యుడు పాచిపెంట చిన్నస్వామి డిమాండ్‌ చేశారు. సుమారు 480 మంది గిరిజన విద్యార్థులను తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం లేకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం సరికాదన్నారు. విద్యార్థులను తరలించాల్సిన పరిస్థితి ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు.