హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు

AKP: కోటవురట్ల మండలంలో తంగేడు, ఏఎస్ పేట గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఎంపీడీవో చంద్రశేఖర్, డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు శుక్రవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఫర్నిచర్, విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పరిశీలించామన్నారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శులకు పలు సూచనలు సలహాలు ఇచ్చామన్నారు.