హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూజివీడులో న్యాయవాదుల నిరసన

ELR: నూజివీడు కోర్టు వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న న్యాయవాదుల నిరసన శుక్రవారం రెండవ రోజుకు చేరుకుంది. నూజివీడు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇందుపల్లి సత్య ప్రకాష్ మాట్లాడుతూ.. న్యాయవాదులకు రక్షణ చట్టం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కక్షిదారులకు న్యాయం జరగాలని నిత్యం పోరాడుతున్న న్యాయవాదులపై తరచూ దాడులు జరగడం దారుణమన్నారు.