ATP: ఈనెల 30న సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన నేపథ్యాన శుక్రవారం సాయంత్రం అధికారులు ఏఎస్‌ఎల్ నిర్వహించారు. శిల్పారామం, ఎంవైఆర్ కళ్యాణ మండపం ప్రాంతాల్లో కలెక్టర్ ఓ.ఆనంద్, ఎస్పీ పి.జగదీష్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రూట్, హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలను సమీక్షించారు. కట్టుదిట్టమైన భద్రత, బందోబస్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటనకు పటిష్ట భద్రత ఏర్పాట్లు


