హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ నంబర్ ప్లేట్ ఏర్పాటు.. నిందితుడికి రిమాండ్

ADB: పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు యాక్టివా స్కూటీకి నకిలీ నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసిన భీంసరి గ్రామానికి చెందిన నర్సింగ్‌ను రిమాండ్‌కు తరలించినట్లు CI నాగరాజు తెలిపారు. RTC బస్టాండ్ సమీపంలో వాహనాల తనిఖీల్లో వేర్వేరు నంబర్లు ఉండటాన్ని పోలీసులు గుర్తించారని వెల్లడించారు. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలుంటాయని CI హెచ్చరించారు.