MDK: తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని దంతెపల్లి నాగరాజు వృత్తిరీత్యా గత పదేళ్లుగా కెనడాలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ పదేళ్లలో ఎన్నిసార్లు భారత్‌కు వచ్చినా రాఖీ పండుగ సమయంలో ఇక్కడ ఉండే అవకాశం రాలేదు. అయితే ఈసారి స్వదేశానికి వచ్చిన సమయంలోనే రాఖీ పండుగ రావడంతో నాగరాజు ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి రాఖీ వేడుకలను సంతోషంగా జరుపుకున్నారు.
తెలంగాణ
రాఖీ కోసం కెనడా నుంచి..


