SKLM: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం సీఐ వెంకటరావు సూచించారు. మెలియాపుట్టి మండలం తెంబూరు గ్రామంలో శుక్రవారం ‘సంకల్పం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓటీపీలు, బ్యాంకు వివరాలను అపరిచితులకు ఇవ్వవద్దని, అనుమానాస్పద లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి'


