హైదరాబాద్: 28°C
తెలంగాణ

వంటశాలను పరిశీలించిన కలెక్టర్

GDWL: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా శుక్రవారం అలంపూర్‌లో పర్యటించి ఆలయ సమీపంలోని వంటశాలను పరిశీలించారు. వంటశాల నిర్వహణ, భోజన ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు నాణ్యమైన భోజనంతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సై, తహసీల్దార్ ప్రభాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.