VZM: శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎస్పీ దామోదర్‌తో కలిసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 25, 26వ తేదీల్లో విజయనగరం ఉత్సవాలు, 27న సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వైభవంగా విజయనగరం ఉత్సవాలు'


