హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి'

ATP: ఇంజనీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. రోడ్లు, బ్రిడ్జిలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలు, జలజీవన్ మిషన్ పైప్‌లైన్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని మానిటర్ చేయాలన్నారు.