SKLM: వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ సందర్భంగా జాతీయ హరిత దళం, జూనియర్ రెడ్ క్రాస్ క్లబ్ ఆధ్వర్యంలో వృక్ష రక్షాబంధన్ నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలకు రాఖీలు కట్టి వాటిని సోదరీమణుల్లా సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టి. హేమారావు, ఎస్ఎంసీ చైర్మన్ బి. లక్ష్మిపతి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సోదర బంధాన్ని చెట్టుతో పంచుకున్న విద్యార్థులు


