హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫార్మా పరిశ్రమను ప్రారంభించిన ఎమ్మెల్యే

TPT: ఓజిలి మండలం కారూరు గ్రామంలో రూ.57 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఆక్టివ్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ప్రారంభమైంది. హ్యూమన్ మెడికేషన్ ఔషధాలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో పరిశ్రమ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. పరిశ్రమలోని ఆధునిక యంత్ర పరికరాలను పరిశీలించి, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఔషధాల తయారీ చేపట్టాలని సూచించారు.