హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హ్యాకథాన్ పోస్టర్ ఆవిష్కరణ

VSP: స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌-2026లో భాగంగా నిర్వహిస్తున్న ఇంటర్నల్ హ్యాకథాన్ పోస్టర్‌ను ఏయూ వీసీ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ శుక్రవారం ఆవిష్కరించారు. విద్యార్థులు సాంకేతికతను వినియోగించి సమాజం, పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలకు నూతన పరిష్కారాలు చూపాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ కె. రాంబాబు, పలువురు డీన్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.