హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ

NTR: మైలవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సంక్షేమ పథకాలు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రహదారులు, తాగునీరు వంటి సమస్యలను ప్రజలు వివరించారు. ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.