NLG: కామ్రేడ్ మాదగోని నర్సన్న 27వ వర్ధంతిని చండూరు మండలం బంగారిగడ్డలో శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నలపరాజు రామలింగయ్య, చండూరు మండల సీపీఐ కార్యదర్శి నలపరాజు సతీశ్ పాల్గొని మాట్లాడారు. ఆయన చేసిన ఉద్యమాలు నేటి తరానికి స్ఫూర్తి అంటూ కొనియాడారు.
తెలంగాణ
కామ్రేడ్ మాదగోని నర్సన్న వర్ధంతి


