హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటర్ ప్రవేశాలకు 31 చివరి గడువు: ప్రిన్సిపల్

SRD: సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువు ఈ నెల 31తో ముగియనుందని ప్రిన్సిపల్ సునీత తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన బాలికలు వెంటనే నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు పొడిగించే అవకాశం లేదని, ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు.