హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగరి ప్రజలకు ఎమ్మెల్యే రాఖీ శుభాకాంక్షలు

CTR: రక్షాబంధన్ సందర్భంగా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి తెలుగింటా సోదర, సోదరీమణుల ప్రేమానురాగాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఒకరికొకరు రక్షణగా, ఆలంబనగా నిలిచి జీవితంలో విజయాలు సాధించాలని కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలువురు మహిళలు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.