హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెడ్ క్రాస్ భవనంలో ఉచిత హోమియో వైద్య శిబిరం

BPT: రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో ఆయుష్ శాఖ, రెడ్ క్రాస్ సౌజన్యంతో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ రోగులను పరిశీలించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. దీర్ఘకాలిక, మొండి వ్యాధులకు ప్రభుత్వ హోమియో వైద్యం ఎంతో మేలైనదని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ చంద్రశేఖర్ కోరారు.