హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వంపై తలసాని ఫైర్

HYD: వెస్ట్ మారేడ్‌పల్లిలో జరిగిన రాఖీ వేడుకల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అమలుకాని హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రస్తుత పాలనపై ప్రజలు విసిగిపోయారని అన్నారు. మరో రెండేళ్లలో తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.