హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు జిల్లాకు వర్ష సూచన..!

VSP: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రేపు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రయాణికులు జాగ్రత్తలు వహించాలని అధికారులు హెచ్చరించారు.