హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డుపై దూసుకెళ్లిన కారు.. ఇద్దరికి గాయాలు

TPT: చంద్రగిరిలో శుక్రవారం అదుపుతప్పిన కారు రోడ్డుపై వెళ్తున్న వారిపై దూసుకెళ్లడంతో ఓ మహిళ సహా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు రోడ్డు పక్కన ఉన్న షాపులు, పలు వాహనాలను ఢీకొట్టి ధ్వంసం చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.