హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మరుగుదొడ్ల పనులు వేగవంతం చేయాలి'

PPM: జిల్లాలో నిర్మాణంలో ఉన్న సామూహిక మరుగుదొడ్లు, అంగన్వాడీ టాయిలెట్లు, తాగునీటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, మిగిలిన పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. పూర్తయిన పనుల బిల్లుల చెల్లింపును వేగవంతం చేయాలని సూచించారు.