హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిగులు సీట్లకు కౌన్సెలింగ్

AKP: జిల్లా ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో మిగులు సీట్ల భర్తీకి నాలుగో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు నర్సీపట్నం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ గౌరిమణి తెలిపారు. ఈనెల 31లోపు అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు అదే రోజున ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు.