హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థులు మంచి మార్కులు సాధించాలి'

SKLM: ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులందరూ ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచి మార్కులు సాధించాలని ఎంఈవో బమ్మిడి మాధవరావు ఆకాంక్షించారు. శుక్రవారం జలుమూరు మండలం తిముడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి, పరీక్షల్లో విజయం సాధించడానికి అనుసరించాల్సిన మెళకువలు, పాఠ్యాంశాలపై పట్టు సాధించే విధానాలను వివరించారు.