హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భాకరాపేటలో ప్రయాణికుల అవస్థలు

KDP: సిద్ధవటం మండలం భాకరాపేటలో బద్వేల్ వైపు వెళ్లే RTC బస్సులు సమయపాలన లేకుండా రాకపోకలు సాగించడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోరుమామిళ్ల, బద్వేల్ వెళ్లే వారు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. బస్టాండ్ సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అధికారులు స్పందించి బస్సులను సమయపాలనతో నడపడంతో పాటు బస్టాండ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.