హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గోవులకు రాఖీలు.. వినూత్నంగా రక్షాబంధన్ వేడుకలు

JN: పాలకుర్తి మండల కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలను ఓ కుటుంబం వినూత్నంగా నిర్వహించింది. తమ పెంపుడు గోవులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ భార్గవి వాటికి తిలకం దిద్ది రాఖీలు కట్టారు. అర్చకుల వేదమంత్రాల మధ్య గోవులకు ప్రత్యేక పూజలు చేసి దీపహారతి ఇచ్చారు.స్వీట్లకు బదులుగా అరటిపండ్లు, ఆకుకూరలతో గోవులకు విందు ఏర్పాటు చేశారు. మూగజీవులపై ప్రేమాభిమానాలను చాటారు.