హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే చర్యలు తప్పవు: MRO

KDP: ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సిద్ధవటం MRO విజయ్‌కుమార్ హెచ్చరించారు. పెద్దపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 873/3లో 16.40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో గుర్తించిన అధికారులు శుక్రవారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన ఇద్దరికి నోటీసులు జారీ చేశామని MRO తెలిపారు.