హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి సమస్యను పరిష్కరించాలి: సీపీఐ

అన్నమయ్య: గాలివీడు మండలం గోరన్‌చెరువు గ్రామంలోని ఎస్టీ కాలనీలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ డిమాండ్ చేశారు. పది రోజులుగా బోరు పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని, లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.