హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చంద్రగిరిలో ఘనంగా రాఖీ వేడుకలు

TPT: చంద్రగిరి పార్టీ కార్యాలయంలో ఘనంగా రాఖీ వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు ఎమ్మెల్యే పులివర్తి నానికి రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారందరినీ ఆప్యాయంగా పలకరించి, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలకు స్వీట్లు తినిపించారు.