కోనసీమ: ఆలమూరు మండలం జొన్నాడలో రక్షాబంధన్ వేడుకలు వినూత్నంగా జరిగాయి. చిటికెన బాపిరాజు కుటుంబ సభ్యులు తమ పెంపుడు శునకానికి తిలకం దిద్ది రాఖీ కట్టారు. శునకాన్ని కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ప్రేమాభిమానాలు చాటుకున్నారు. సంప్రదాయానికి భిన్నంగా జరిగిన ఈ రాఖీ వేడుక స్థానికులను ఆకట్టుకుంది. సోదరులకు రాఖీ కట్టే ఆనవాయితీకి భిన్నంగా శునకానికి రాఖీ కట్టారు.
ఆంధ్రప్రదేశ్
పెంపుడు శునకానికి రాఖీ


