TPT: తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానాన్ని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ శుక్రవారం సందర్శించారు. భక్తులకు అందుతున్న వసతులు, క్యూ లైన్లు, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. మెరుగైన సౌకర్యాల కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. TTD నిధులతో ఆలయ పునర్నిర్మాణం, కోనేరు అభివృద్ధి, సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తలకోన ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్


