KRNL: పెద్దకడబూరులోని ఎస్సీ కాలనీ 5వ వార్డులో కల్వర్టు ధ్వంసమై ప్రమాదకరంగా మారింది. కల్వర్టు కొంత భాగం దెబ్బతినడంతో రహదారిపై రాకపోకలు సాగించే ప్రజలు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో నిత్యం విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, వాహనదారులు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దకడబూరులో పొంచి ఉన్న ప్రమాదం


