హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూ ఆక్రమణపై ఫిర్యాదు.. వీఆర్వో పరిశీలన

KDP: సిద్ధవటం (M) శాఖరాజుపల్లి రెవెన్యూ పరిధిలోని ముమ్మడిగుంటపల్లి సర్వే నంబర్‌ 449లో భూమి చదును పనులపై ఫిర్యాదు రావడంతో VRO హరికృష్ణ శుక్రవారం పరిశీలించారు. రికార్డుల ప్రకారం రైతు గోశపాతల నరసయ్యకు 1.60 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ప్రభుత్వ డీకేటీ భూమి ఆక్రమణపై సర్వే చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. హద్దులు నిర్ధారించే వరకు చదును పనులు చేపట్టరాదని స్పష్టం చేశారు.