వరంగల్ నగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి ఆలయాన్ని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఇవాళ సందర్శించారు. నేడు పవిత్ర శ్రావణ శుక్రవారం, రక్షా బంధన్ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసారు. ఆలయ ప్రధాన అర్చకుడు శేషు, అధికారులు ఆయనకు స్వాగతం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
భద్రకాళి ఆలయంలో MLA నాయిని పూజలు


