హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీకి కేటాయించడం సరికాదు'

కోనసీమ: రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల తాగునీటి అవసరాలకు ఉపయోగపడే సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించడం సరికాదని మాజీ మంత్రి విశ్వరూప్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం భట్నవిల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన స్థలాల కేటాయింపును ప్రభుత్వం వెంటనే పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు.