పార్వతీపురంలోని గోపాలపురం గ్రీన్‌ఫీల్డ్ కాలనీ దాటిన తర్వాత ఉన్న జగనన్న కాలనీలో వీధి లైట్లు ఏర్పాటు చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీధి దీపాలు పగటిపూట కూడా వెలుగుతుండటంతో విద్యుత్ వృథా అవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు లైట్లు వెలిగించి, ఉదయం 6 గంటలకు ఆపేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పగటిపూట వెలుగుతున్న వీధి దీపాలు


