హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన పారిశుద్ధ్య కార్మికులు

శ్రీకాకుళంలో రక్షా బంధన్ వేడుకలను ఘనంగా  నిర్వహించారు. ఈ మేరకు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులు ఎమ్మెల్యే గొండు శంకర్‌‌కు శుక్రవారం ఆత్మీయంగా రాఖీలు కట్టారు. మహిళా కార్మికులను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.