హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తికి సీఎం చంద్రబాబు రాక

TPT: ఈ నెల 30న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తికి రానున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ శుక్రవారం పరిశీలించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఇతర అధికారులతో కలిసి భద్రత, ట్రాఫిక్, ఇతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన విజయవంతంగా సాగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.