VSP: భీమిలి పరిధిలో గంజాయి అక్రమ రవాణా, క్లిష్టమైన హిట్ అండ్ రన్ కేసులను వేగంగా ఛేదించిన సీఐ దివాకర్ యాదవ్ బృందంపై పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రశంసలు కురిపించారు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సీఐకు శుక్రవారం ఆయన రెండు ప్రత్యేక రివార్డులు అందజేసి సత్కరించారు. నేరాల నియంత్రణలో పోలీసుల తీరు స్ఫూర్తిదాయకమని సీపీ కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
భీమిలి సీఐపై సీపీ ప్రశంసలు


