హైదరాబాద్: 28°C
తెలంగాణ

​ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి: సీఐ

RR:​ ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ్ ఆదేశాలతో పాలమాకుల P1 రోడ్డులో ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ బి. శంకరయ్య మాట్లాడుతూ మద్యం తాగి వాహనం నడపడం, డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్ వినియోగించడం ప్రమాదకరమని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. అనంతరం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.