హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూముల రీ సర్వే పరిశీలించిన అ. కలెక్టర్

SRCL: బోయినపల్లి మండలం కొత్తపేటలో భూ భారతి కింద రోవర్ యంత్రంతో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ శుక్రవారం పరిశీలించారు. సర్వే విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని, రైతులకు ముందుగా సమాచారం అందించి భూముల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు.