హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెస్ట్ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్

NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ చందన సురేష్, టీడీపీ సీనియర్ నాయకులు గుర్రంకొండ పాల్గొని.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకురాగా.. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.