NTR: విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది కొప్పుల మోహన్‌తో పాటు సుమారు 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుద్ధా వెంకన్న, నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా సమక్షంలో కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మోహన్‌కు న్యాయపరమైన అవగాహన, ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉండటం పార్టీకి ఉపయోగపడుతుందని బుద్ధా వెంకన్న అన్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో టీడీపీలో చేరిన 50 కుటుంబాలు


