హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

NDL: డోన్‌లో ఆటో డ్రైవర్లకు డీఎస్పీ శ్రీనివాస్, మేజిస్ట్రేట్ నూరుల్లా ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. యూనిఫాం ధరించి క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం స్పాన్సర్ చేసిన 50 ఖాకీ షర్టులను డ్రైవర్లకు అందజేశారు.