హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

VKB: సోదర, సోదరీమణుల ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్ సందర్భంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ఈ బంధం ప్రతి కుటుంబంలో సంతోషం, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. ప్రేమ, నమ్మకం, రక్షణకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున కోరారు.