హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈనెల 31న జిల్లా వైసీపీ ఆఫీస్ ప్రారంభం'

శ్రీకాకుళం టౌన్ హాలులో ఈ నెల 31న జరిగే జిల్లా వైసీపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, ఈ కార్యాలయం పార్టీ బలోపేతానికి, కార్యకలాపాల విస్తరణకు కేంద్రంగా ఉంటుందన్నారు. నియోజకవర్గాల వారీగా సమాయత్తమై సభను జయప్రదం చేయాలన్నారు.